50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
nASA Artemis II mission: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి నాసా (NASA) సిద్ధమైంది. ‘ఆర్టెమిస్ II’ (Artemis II) మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్‌లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే ట్యాంకింగ్ ఆపరేషన్స్ లో భాగంగా రాకెట్‌లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఏప్రిల్ 1న సాయంత్రం 6:15 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఒకవేళ ఈ తేదీన ప్రయోగం జరగకపోతే.. ఏప్రిల్ 6 వరకు లోపు, లేదా అది కూడా కుదరకపోతే ఏప్రిల్ 30న ప్రయోగించనున్నారు.
ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
ఈ మిషన్ లో మొత్తం నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. రీడ్ విలియమ్స్ కమాండర్ గా, విక్టర్ గ్లోవర్ పైలట్‌గా, క్రిస్టినా కొచ్ మిషన్ స్పెషలిస్టుగా, అలాగే కెనడా స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హాన్సెన్ సభ్యుడిగా ఉంటారు. ఈ ప్రయోగం అనంతరం స్పేస్ క్రాఫ్ట్ మొదట “లో ఎర్త్ ఆర్బిట్”లోకి ప్రవేశించి.. దాదాపు 24 గంటల తర్వాత ‘ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్’ ద్వారా చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ మిషన్ లో ముఖ్య ఘట్టం ఏప్రిల్ 6న చంద్రుడి చుట్టూ “ఫ్లైబై” చేయడం. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం రాత్రి 11:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఒక గంటలోనే ఈ వ్యోమగాములు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన మనుషులుగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఉన్న అపోలో-13 మిషన్ రికార్డును ఇప్పుడు అధిగమించే అవకాశం ఉంది.
Kavitha: సీఎం రేవంత్‌రెడ్డికి కవిత లేఖ.. నాడు కేసీఆర్‌కు రాసిన లేఖను గుర్తు చేసిన జాగృతి అధినేత్రి!
ఏప్రిల్ 7న ఈ మిషన్ లో ఉన్న వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సిబ్బందితో ఆడియో సంభాషణ జరపనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం ఏప్రిల్ 8న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9న వ్యోమగాములు అంతరిక్షం నుంచే మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మిషన్ ఏప్రిల్ 10న ముగియనుంది. పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరానికి సమీపంలో స్ప్లాష్ డౌన్ జరగనుంది. ఆ తరువాత అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక నౌక ద్వారా వ్యోమగాములు, స్పేస్ క్రాఫ్ట్ ను సురక్షితంగా తీసుకువస్తారు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు కీలక దశగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?