మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఉప్పెన మూవీ ఇచ్చిన జోష్ లో పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలలో నటించాడు. కానీ ఆ సినిమాలేవి కూడా ఉప్పెన రేంజ్ హిట్ కాలేకపోయాయి. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తాజాగా నటించిన మూవీ ఆదికేశవ.ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్ 22) నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీనిశ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేశాడు.ఆదికేశవ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పూర్తిగా మాస్ అవతార్ లో కనిపించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కింద నాగ వంశీ మరియు సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.ఆదికేశవ మాస్ మాసాల హంగులతో కూడిన కమర్షియల్ మూవీ. హీరో ప్రేమ కు హీరోయిన్ తండ్రి అడ్డుచెప్పడం అలాగే హీరోకు ఓ పెద్ద ప్లాష్‌బ్యాక్ ఉండటం, విలన్‌పై రివేంజ్ కోసం సీమలో అడుగుపెట్టడం అనే కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు అయితే వచ్చాయి. ఆదికేశవ సినిమా కథ కూడా అలాగే సాగుతుంది.కథ, కథనాల విషయం లో కొత్తదనం ఉండదని ప్రమోషన్స్‌లోనే దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు.వారి మాటలకు తగ్గట్లుగానే సినిమా ఆద్యంతం రోటీన్ గా సాగుతుంది. హీరో ఫ్లాష్‌బ్యాక్ బయటపడినప్పుడే క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.మరి థియేటర్స్ లో ఆకట్టుకోని ఆదికేశవ ఓటీటీ లో అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి