800 year old Mummy : వెర్రి వెయ్యి రకాలు అంటే ఇదేనేమో.. ఓ యువకుడు చచ్చిన శవాన్ని బ్యాగులో పెట్టుకుని తిరుగుతూ.. ఇది ఏంటని ప్రశ్నిస్తే ప్రేమిస్తున్నాను. ఇది నా గర్ల్ ఫ్రెండ్ దానిని నేను ప్రేమిస్తున్నానని దాన్ని వదిలి ఉండలేంటున్నాడు. ఈ చిత్ర విచిత్ర కోరిక విన్న పోలీసులు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే.. పెరూలో 26 ఏళ్ల జూలియో సీజర్ బెర్మెజో అనే యువకుడి ఓ మమ్మీ ఉందని పోలీసులకు సమాచారం అందింది. అతను మమ్మీలను అక్రమంగా అమ్ముతున్నాడని ఆరోపణలో జూలియోను ప్రశ్నించారు. దానికి అతను 30 ఏళ్లుగా ఈ మమ్మీ మా ఇంట్లోనే ఉంటోందని దానిని తన తండ్రి ఈ మమ్మీని ఇచ్చాడని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడని ఈ మమ్మీని నేను ప్రేమిస్తున్నాను..ఆరాధిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అతని సమాధానం విన్న పోలీసులకు దిమ్మ తిరిగింది. మమ్మీని ఒక ఐసోథర్మల్ బ్యాగ్‌లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నానని పోలీసులకు చెప్పాడు. దీంతో అతని సమాధానం విన్న పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు.
Read Also: Air Pollution : ముంబైలో ఆస్పత్రుల పాలవుతున్న జనం.. కారణం తెలిసినా ఏం చేయలేని వైనం
పునో ప్రాంతానికి చెందిన సీజర్ బెర్మెజో కుటుంబం ఫుడ్, సరుకుల రవాణా చేస్తుండేది. అదే వారి వృత్తిగా ఉండేవారు. 30 ఏళ్ల క్రితం బెర్మెజో తండ్రి జువానిటా అనే మమ్మీని తనతో తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. దాన్ని కుటుంబ సభ్యులంతా జాగ్రత్తగా చూసుకునేవారు. కొంతకానికి బెర్మెజో చనిపోయాడు. చనిపోయే ముందు మమ్మీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడట. దానింతో తనకు తన తండ్రి తర్వాత వారసత్వంగా బెర్మెజో ఆ మమ్మీని చూసుకుంటున్నాడు. జూలియో ఎక్కడికి వెళ్లినా ఆ మమ్మీ బ్యాగును కూడా తీసుకెళుతుంటాడు.
Read Also: Anil Kumar Yadav: పవన్, లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్ సవాల్.. ఆ ధైర్యం ఉందా.?
అలా బ్యాగులో ఆ మమ్మీని పెట్టుకుని తిరుగుతుంటాడు. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం జూలియో తన స్నేహితులతో కలిసి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వారి వద్దకొచ్చారు. జూలియో వద్ద ఉన్న పెద్ద బ్యాగు అనుమానాస్పదంగా కన్పించింది. దీంతో పోలీసులు ఆ బ్యాగు చూపించమని అడిగారు. బ్యాగులో ఉన్న మమ్మీన్ని చూసి పోలీసులు ఖంగుతున్నారు. దాని గురించి ప్రశ్నించగా మమ్మీ గురించి చెప్పుకొచ్చాడు. కానీ పోలీసులు మాత్రం అతను మమ్మీని అక్రమంగా విక్రయిస్తున్నాడన్న ఆరోపణలో అదుపులోకి తీసుకున్నారు. ఆ మమ్మీని పరిశీలించిన సైంటిస్టులు అది 600 నుంచి 800ఏళ్ల క్రితానికి చెందినది తెలిపారు.బెర్మెజో అమ్మాయిగా భావిస్తున్న ఆ మమ్మీ మహిళ కాదని 45 ఏళ్ల పురుషుడిదని చెప్పి పెద్ద ట్విస్టే ఇచ్చారు పరిశోధకులు.