తెలంగాణలో అర్ధరాత్రి నుంచే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా పట్టువీడని నెట్ వర్క్ ఆస్పత్రులు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్న నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు.…
Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలనే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న ఉచిత…