Mexico: తుపాకీతో బెదిరించి 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖ సిబ్బంది కిడ్నాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mexico: మెక్సికోలోని సాయుధ బృందం మంగళవారం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో భద్రతా దళాలు అపహరణకు గురైన 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. అపహరణకు గురైన ఉద్యోగులందరూ పురుషులేనని అధికారులు తెలిపారు. తుపాకులతో బెదిరించి భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్‌కు గురైన పురుష ఉద్యోగులందరినీ సాయుధ బృందం సభ్యులు రాష్ట్ర రాజధాని టక్స్‌ట్లా గుటిరెజ్‌కు పశ్చిమాన 22 మైళ్ల (34.4 కి.మీ) దూరంలో ఉన్న హైవేపైకి తీసుకెళ్లారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read: UP: ఉత్తర ప్రదేశ్లో అరుదైన ఆపరేషన్.. మహిళ కడుపులో 5కిలోల కణతి
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
మొత్తం 14 మంది ఉద్యోగులు పోలీసు అధికారులు కాదని, పరిపాలన విభాగంలో పనిచేస్తున్నారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదని, అపహరణ వెనుక ఉద్దేశంపై విచారణ జరుపుతున్నామని అధికార ప్రతినిధి తెలిపారు. రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగుల అపహరణపై ఫెడరల్, స్టేట్ ఏజెంట్లు దర్యాప్తు చేస్తున్నారు. వార్తా సంస్థలు విడుదల చేసిన కిడ్నాప్ వీడియోలో, హైవేపై కారు అకస్మాత్తుగా ఆపి, ఉద్యోగులందరినీ తుపాకీతో పట్టుకుని, కారు లోపలికి వెళ్లమని చెప్పారు. ఘటనకు సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?