Site icon NTV Telugu

UP Crime: ఏమైందో ఏమో.. భార్యతో మాట్లాడొచ్చి భర్త గన్తో కాల్చుకుని ఆత్మహత్య

Up Gun

Up Gun

యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త సతీష్ సోని పట్టపగలే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల ఘటన అనంతరం అతను రక్తపు మడుగులో పడిఉన్నాడు. కాల్పుల శబ్దం విని బాటసారులు అక్కడే ఆగిపోయారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.

Read Also: Champai Soren: “నా ఆత్మగౌరవం దెబ్బతింది, నాకు మూడే దారులు”.. ఎన్నికల ముందు జార్ఖండ్‌లో సంచలనం..

గోమతీనగర్‌లోని అవధ్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. బీహార్ నివాసి వ్యాపారవేత్త సతీష్ సోని (39) రెండు వివాహాలు చేసుకున్నాడు. మొదటి భార్య బీహార్‌లో ఉంటోంది. కాగా, రెండో భార్య అవధ్‌పురి, గోమతీనగర్‌లో నివాసం ఉంటోంది. శనివారం సతీష్ తన రెండో భార్యను కలిసేందుకు ఇంటికి వచ్చాడు. అక్కడ భార్యతో గొడవ పడ్డాడు. గొడవ అనంతరం సతీష్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అవధ్‌పురి సిగ్నల్ వద్దకు చేరుకుని గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తంతో తడిసి ముద్దయిన సతీష్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనలో సతీష్ భార్యను విచారిస్తున్నట్లు డీసీపీ పూర్వి తెలిపారు.

Read Also: Suryakumar Yadav: కోల్‌కతా రేప్ ఘటనపై సూర్యకుమార్ ఇన్స్టాలో పోస్ట్.. వైరల్

Exit mobile version