Argentina Protests: అర్జెంటీనాలో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. దేశాన్ని మొత్తం నిరసనలు కమ్మేశాయి. ఇంతకీ ఈ దేశంలో ఏం జరుగుతుంది. ప్రజలందరూ రోడ్లపైకి రావడానికి కారణం ఏంటో తెలుసా.. ముగ్గురి బాలిక చావు. అవును ఈ ముగ్గురి బాలిక హత్య దేశవ్యాప్తంగా దుఃఖాన్ని, ఆగ్రహానికి కారణం అయ్యింది. ఈ హత్యలు చాలా దారుణంగా ఉండటంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలికల హత్యలు, వాళ్లను చిత్రహింసలకు గురి చేసిన వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ప్రత్యక్ష వీడియోలను దాదాపు 45 వేల మంది వీక్షించారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన తర్వాత దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌తో సహా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ప్రజలు అర్జెంటీనా పార్లమెంట్‌కు కవాతు నిర్వహించారు.
READ ALSO: Group -2 : గ్రూప్-2 ఫలితాలు విడుదల
కనిపించకుండా పోయిన ఐదు రోజుల తర్వాత..
మరణించిన బాలికలు లారా గుటిరెజ్ (15), బ్రెండా డెల్ కాస్టుల్లో, మోరెనా వెర్డి (20 ఏళ్ల)లుకా గుర్తించారు. వీళ్లు ముగ్గురు సెప్టెంబర్ 19న ఒక పార్టీకి హాజరైన తర్వాత కనిపించకుండా పోయారు. ఐదు రోజుల తర్వాత పోలీసులు వారి మృతదేహాలను ఒక ఇంటి వెనుక పాతిపెట్టి ఉన్నట్లు కనుగొన్నారు. పోలీసుల దర్యాప్తులో వాళ్లను మొదట దారుణంగా కొట్టి, వారి గోళ్లను బయటకు తీసి, వేళ్లను నరికి, ఆపై చంపేశారని తేలింది. వీళ్లు తమ నుంచి డ్రగ్స్ దొంగిలిస్తున్నారని అనుమానించిన డ్రగ్స్ ముఠా ఇలా చేసిందని అధికారులు చెబుతున్నారు. ఒక వీడియోలో డ్రగ్స్ ముఠా నాయకుడు “నా నుంచి డ్రగ్స్ దొంగిలించే వారికి కూడా అదే గతిపడుతుంది” అని చెప్పినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో ఒకరి తండ్రి బ్రెండా మాట్లాడుతూ.. తన కుమార్తె పరిస్థితి చూసిన తర్వాత ఆమెను గుర్తుపట్టలేకపోయానని కన్నీటిపర్యంతం అయ్యారు.
ప్రైవేట్ ఖాతా నుంచి ప్రత్యక్ష ప్రసారం..
పలు నివేదికల ప్రకారం.. మొత్తం ఈ హత్యలను నిందితులు ఒక ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యంలోని మెటా సంస్థ.. ఈ సంఘటనకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని పేర్కొంది. పోలీసుల దర్యాప్తునకు వాళ్లు కూడా సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురి హత్య తర్వాత వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. “తమ జీవితాలకు విలువ లేదా?” అంటూ బ్యానర్‌లను పట్టుకొని నిరసనలు తెలిపారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
READ ALSO: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో బీకర కాల్పులు.. ముగ్గురు నక్సలైట్లు మృతి