BP Monitor: మీకు రక్తపోటు ఉందా..? బీపీ ఎక్కువైనా సరే.. తక్కువైనా సరే.. మనుషుల్లో కోపగించుకోవడమో.. లేదంటే చిరాకు లాంటివి వస్తుంటాయి. అంతేకాకుండా కళ్లు తిరిగిపడిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బీపీ ఉన్న వారిలో మానసిక ప్రశాంతత కూడా దెబ్బతింటాయి. ఇటీవల కాలంలో మానవుల్లో రక్తపోటు అధికంగా అవుతుంది. దానికి మానసిక సమస్య కావొచ్చు.. వారు తినే ఆహారపు అలవాట్ల వల్ల రక్తపోటు ఎక్కువవుతుంది. అయితే మనుషుల్లో రక్తపోటు ఎక్కువుందా.. తక్కువుందా అని తెలుసుకోవడానికి.. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్తే Sphygmomanometer ద్వారానే వారు చెకప్ చేస్తారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా.. మనం ఇంటి దగ్గరే బీపీని చెకప్ చేసుకోవడానికి పరిశోధకులు ఓ కొత్త రకం క్లిప్ ని ఆవిష్కరించారు. అయితే ఎంత ధరకు వస్తుందో.. దానిని ఎలా వాడాలో తెలుసుకుందాం.
Read Also: S** Harassment:‘మేడం మీ ఫిగర్ సూపర్’ అన్నా లైంగిక వేధింపే.. బీ కేర్ ఫుల్..
స్మార్ట్ ఫోన్ సాయంతో రక్తపోటును చెకప్ చేసుకునేందుకు మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో బృందం తయారుచేసింది. ఫోన్ లో ఉన్న ఓ యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తయారు చేసేందుకు 80 సెంట్స్ ఖర్చు అయ్యింది. అయితే దీనిని 10 సెంట్లకు తీసుకొచ్చేలా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు సైటిఫిక్ రిపోర్ట్స్ లోని జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. దీని సాయంతో రెగ్యూలర్ బీపీ మోనిటరింగ్ సులభతరం అవుతుంది. అలాగే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బీపీ చెకప్ చేసుకునేందుకు వృద్ధులు, గర్భిణులు ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బీపీ చెకప్ కోసం ప్రతిసారి క్లినిక్ వెళ్లాల్సిన అవసరం ఉండదని యూసీ శాన్ డియాగోలోని ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ వ్యాంగ్ అన్నారు.
Read Also: Viral video: ఇదేం పైత్యం నాయనా.. పుచ్చకాయతో పిచ్చి ప్రయోగాలేంటి రా సామి..
బీపీ చెక్ చేసుకోవడానికి వినియోగదారుడు క్లిప్‌పై చూపుడు వేలితో నొక్కితే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ వినియోగదారుడు ఎంతసేపు నొక్కాలి అనే దానిపై మార్గనిర్దేశం చేస్తుంది. ఆ క్లిప్ కు 3డీ-ప్రింటెడ్ ప్లాస్టిక్ అటాచ్‌మెంట్ అయి ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరా మరియు ఫ్లాష్ సైజ్ లోనే ఉంటుంది. వినియోగదారు క్లిప్‌పై నొక్కినప్పుడు, స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ వేలిముద్రను వెలిగిస్తుంది. క్లిప్ లోపల ఉన్న స్ప్రింగ్ వినియోగదారుని వివిధ స్థాయిల శక్తితో నొక్కడానికి అనుమతిస్తుంది. వినియోగదారు ఎంత గట్టిగా నొక్కితే అంత సైజ్ లో కెమెరాలో అంత పెద్దగా రెడ్ సర్కిల్ కనిపిస్తుంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ యాప్ ఈ రెడ్ సర్కిల్ నుంచి ప్రధాన సమాచారాన్ని సంగ్రహిస్తుంది. వేలిముద్రలోనికి, వెలుపలికి వెళ్ళే రక్తం పరిమాణాన్ని కొలుస్తుంది. యాప్ లోని ఒక అల్గోరిథం ఈ సమాచారాన్ని సిస్టోలిక్, డయాస్టొలిక్ రీడింగ్‌లుగా మారుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే యూసీ శాన్ డియాగో మెడికల్ సెంటర్ లో 24 మంది వాలంటీర్లపై పరిశోధకులు క్లిప్‌ను పరీక్షించారు. దాని ఫలితాలు రక్తపోటు పరికరం ద్వారా తీసుకున్న దానితో సమానంగానే వచ్చినట్టు తెలిపారు. మరిన్ని పరీక్షలు నిర్వహించి త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పరిశోధకులు తెలుపుతున్నారు.