NTV Telugu Site icon

Constable Love Affair : ఫ్రెండ్ షిప్.. లవ్.. రూమ్.. ప్రెగ్నెంట్ కాగానే ప్లాన్ రివర్స్

Conistable

Conistable

Constable Love Affair : నేను పోలీసును నన్నెవరు ఏం చేయలేరు.. అని ఓ యువతిని తన మాయమాటలతో బుట్టలో వేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ మోసం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని.. వాడుకుని ఇప్పుడు మొఖం చాటేశాడు. దీంతో ఆ యువతి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్‌.ఎస్‌ మక్తాకు చెందిన యువతికి ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఎ.నిఖిల్‌తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వారి స్నేహం ప్రేమగా మారింది.

Read Also: VBIT College : విద్యార్థినుల ఫోటో మార్ఫింగ్ కేసు.. ఆ నలుగురే నిందితులు

రెండేళ్ల క్రితం తన పుట్టిన రోజు అని చెప్పి యువతిని బయటకు తీసుకెళ్లాడు. మాటలతో నమ్మించి ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఆమెతో శారీరకంగా కలిశాడు. అప్పటి నుంచి యువతిని అదో ఇదో చెప్పి నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. అంతా అయ్యాక అమ్మాయి వివాహం చేసుకోమని డిమాండ్ చేసింది. అలా అడిగినప్పుడల్లా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో యువతి వెళ్లి గట్టి ఎందుకు దూరంపెడుతున్నావంటూ నిలదీసింది. దీంతో అయ్యగారి బాగోతం బయటపడింది.

Read Also: Caucasian Shepherd Dog: రూ.100కోట్లు ఇచ్చినా ఆ కుక్కను అమ్మేదిలేదు.. అవన్నీ పుకార్లు

నిఖిల్ కు మరో యువతితో సంబంధం ఉందని తెలిసింది. అప్పటి నుంచి బాధితురాలు అతడిని దూరం పెట్టడం ప్రారంభించింది. రెండున్నర నెలల క్రితం తన ఇంటికి రావాలని మాట్లాడుకుందామని చెప్పడంతో యువతి నమ్మి వెళ్లింది. ఇంట్లోనే యువతిపై కానిస్టేబుల్‌ అఘాయిత్యానికి పాల్పడంతో యువతి గర్భం దాల్చింది. దీంతో ఈ సారి తననుపెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగింది. కానిస్టేబుల్‌ అందుకు నిరాకరించాడు. తాను పోలీస్‌నని తనను ఎవరూ ఏమి చేయలేరని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీంను ఆశ్రయించింది. 

Read Also: Big Breaking: కూకట్ పల్లిలో కూలిన అంతస్తు…. శిథిలాల కింద కార్మికులు

విషయం తెలుసుకున్న నిఖిల్‌ బాధితురాలి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భం ఇప్పుడే వద్దంటూ కొన్ని మాత్రలు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని అడగగా అప్పటినుంచి మళ్లీ ముఖం చాటేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments