Dalit Bandhu : దళిత బంధు నిధులు విడుదల చేయాలని దరఖాస్తుదారుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళిత బంధు పథకం రెండోదశ కింద మంజూరైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితుల బంధు సాయం కోసం గుర్తించిన లబ్ధిదారులు ప్రజాభవన్ వద్ద నిరసన చేపట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు ఈ పథకం కింద రూ.10 లక్షల సాయం అందించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో లబ్ధిదారుడికి రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి ఆ పథకానికి అంబేద్కర్ అభయ హస్తం అని నామకరణం చేసింది. అయితే, పథకం యొక్క రెండవ దశ కింద షార్ట్‌లిస్ట్ చేయబడిన లబ్ధిదారులు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమోదించిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లబ్దిదారులు యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు , అటువంటి యూనిట్లను గ్రౌండింగ్ చేసే స్థితిని బట్టి, జిల్లా కలెక్టర్లు నిధులను విడుదల చేస్తారు.
Cylinder Blast: స్కూల్‌లో పేలిన సిలిండర్.. విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
Also Read
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
- Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పలువురు లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో 500 మందికి పైగా లబ్ధిదారులు ప్రజా భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. దళితుల బంధు పథకం కింద లబ్ధిదారులకు సహాయం కోసం షార్ట్‌లిస్ట్ చేసి నాలుగు నెలలైంది. గత ప్రభుత్వం కూడా ఒక్కో లబ్ధిదారునికి రూ.3 లక్షలు మంజూరు చేసిందని, తుది ఆమోదం కోసం జిల్లా కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు కోగిల మహేష్ తెలిపారు. “లబ్దిదారులు వారి వారి యూనిట్లను గ్రౌండ్ చేయడానికి రూ. 3 లక్షలు విడుదల చేయడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము,” ప్రభుత్వం వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోతే, వారు తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.
Nepal: బస్సు ప్రమాదంలో 14 మంది భారతీయుల మృతి.. నేపాల్లో తరచూ ప్రమాదాలకు కారణాలివే..
తాజావార్తలు
-
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
-
YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
-
Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!