Stop putting your wet Apple iPhone in Rice Bag: ‘స్మార్ట్‌ఫోన్’ నీటిలో పడితే.. మనకు తెలిసిన పద్దతి ఒకటే. నీటిలో పడిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే తుడిచేసి.. ఇంట్లో ఉండే బియ్యం సంచిలో పెడుతాం. ఓ రోజంతా బియ్యం సంచిలో ఉంచిన తర్వాత తీసి ఛార్జింగ్ పెడుతుంటాం. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ‘యాపిల్’ కంపెనీ పేర్కొంది. నీటిలో పడిన ఐఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టొద్దని యూజర్లకు యాపిల్ హెచ్చరించింది.
నీటిలో పడిన ఐఫోన్‌ను ఏం చేయాలో యాపిల్ సూచిందింది. ‘నీటిలో పడిన ఐఫోన్‌ను బియ్యం సంచిలో అస్సలు పెట్టొద్దు. అలా చేస్తే.. బియ్యంలోని సూక్ష్మ రేణువులు ఫోన్‌ను దెబ్బతీస్తాయి. నీటిని తీసివేయడానికి కనెక్టర్ కిందివైపు ఉండేలా.. ఫోన్‌ను ఉంచి చేతితో కొట్టండి. తర్వాత ఫోన్‌ను పొడిగా ఉండే ప్రదేశంలో 30 నిమిషాలు ఉంచండి. తర్వాత యూఎస్‌బీ- సీ ద్వారా ఛార్జ్ చేయండి. ఫోన్‌లో నీరు బయటకు పోవడానికి 24 గంటల సమయం పట్టొచ్చు. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ ద్వారా ఫోన్ పరిస్థితి కూడా తెలుసుకోవచ్చు’ అని యాపిల్ పేర్కొంది.
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం!
ఒక్కోసారి ఫోన్ తడిగా ఉన్నప్పుడు అత్యవసరంగా ఛార్జ్ చేయాల్సి వస్తే.. లిక్విడ్ డిటెక్షన్‌ను ఓవర్‌రైడ్ చేసే వెసులుబాటు ఉంటుందని యాపిల్ తెలిపింది. ఐఫోన్ కొత్తగా కొనుగోలు చేసిన యూజర్లు ఈ సమస్య గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాపిల్ చెప్పింది. 20 అడుగుల నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నా.. పనిచేసే సామర్థ్యం కొత్త ఐఫోన్లకు ఉందని వెల్లడించింది. ఐఫోన్ 15కు వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉన్న విషయం తెలిసిందే.