Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
- ఆపిల్ (Apple) సంస్థలో CEO మార్పు
- సెప్టెంబర్ 1 టిం కుక్ నుంచి సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటన
- ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగింపు
- కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ (John Ternus) బాధ్యతలు స్వీకరణ
- 2011లో స్టీవ్ జాబ్స్ (Steve Jobs) తర్వాత కుక్ సీఈఓగా బాధ్యతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple CEO: ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సంస్థలో భారీ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సీఈఓ టిం కుక్ (Tim Cook) సెప్టెంబర్ 1 నుంచి పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో కంపెనీకి చెందిన సీనియర్ అధికారి జాన్ టెర్నస్ (John Ternus) బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు దశాబ్దానికి పైగా కంపెనీని విజయవంతంగా నడిపించిన కుక్.. ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు.
Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన నిందితుడు.!
Also Read
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
2011లో ఆపిల్ స్థాపకుడు స్టీవ్ జాబ్స్ (Steve Jobs) తర్వాత సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన కుక్, కంపెనీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఆయన పదవీకాలంలో ఆపిల్ మార్కెట్ విలువ సుమారు 3.6 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఆపిల్‌ను నడిపించడం నా జీవితంలో గొప్ప గౌరవం అంటూ కుక్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఆపిల్ ఐఫోన్‌కే పరిమితం కాకుండా ఎకోసిస్టమ్‌ను విస్తరించింది. ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ వంటి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు సర్వీసుల రంగంలో కూడా భారీగా ఎదిగింది. ప్రపంచంలో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన కంపెనీగా నిలిచిన ఆపిల్, అనంతరం 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా అందుకుంది.
అయితే కుక్ కాలంలో ఐఫోన్ లాంటి విప్లవాత్మక కొత్త ఉత్పత్తి రాలేదని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సంస్థను స్థిరంగా పెంచడం, ఆపరేషన్లను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న జాన్ టెర్నస్‌కు ఉత్పత్తుల అభివృద్ధిలో విస్తృత అనుభవం ఉంది. ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన.. ఐఫోన్, మాక్, అలాగే విజన్ ప్రో వంటి అత్యాధునిక పరికరాల అభివృద్ధిని పర్యవేక్షించారు. 25 ఏళ్లుగా ఆపిల్‌లో పనిచేస్తూ కంపెనీ ప్రధాన ఉత్పత్తులన్నింటిలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
ఈ నాయకత్వ మార్పు ఆపిల్‌కు కీలక దశలో జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్, ఓపెన్ AI వంటి కంపెనీలు వేగంగా ముందుకెళ్తుండగా.. ఆపిల్ కొంత వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో హార్డ్‌వేర్ ఇన్నోవేషన్‌తో పాటు AI సామర్థ్యాల పెంపుపై ఆపిల్ మరింత దృష్టి పెట్టే అవకాశముంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?