AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Village Merger: ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సమీప గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామాల విలీనానికి సంబంధించిన ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఈ విలీనాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ రాథేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్లు ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదనలు వినిపించారు.
గ్రామాల తీర్మానాలు, ఆమోదం లేకుండానే వాటిని మున్సిపాలిటీల్లో విలీనం చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విలీనాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పున్నూరు మున్సిపాలిటీ, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, పాలకొల్లు మున్సిపాలిటీ, కందుకూరు మున్సిపాలిటీ, రాజానగరం, భీమవరం మున్సిపాలిటీ, గూడూరు మున్సిపాలిటీ, గుడివాడ మున్సిపాలిటీల పరిధిలో సమీప గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామాల విలీనంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వాటికి అనుసరించిన చట్టపరమైన ప్రక్రియపై తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!