WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Latest WTC Points Table 2026: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025–27 సైకిల్లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దక్షిణాఫ్రికాతో డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 214 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మెట్ రెన్షా అద్భుత బ్యాటింగ్, జోష్ హేజిల్‌వుడ్ పదునైన బౌలింగ్ ఆసీస్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా ఖాతాలో మరో 12 డబ్ల్యూటీసీ పాయింట్లు చేరాయి.
డబ్ల్యూటీసీ పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 81.82 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 72.22 శాతంతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. తొలి టెస్టులో ఓటమితో దక్షిణాఫ్రికా (60) మూడో స్థానానికి పరిమితమైంది. 55.56 శాతం పాయింట్లతో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉండగా.. భారత్ 51.52 శాతంతో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ (38.54), శ్రీలంక (33.33), వెస్టిండీస్ (20.83), పాకిస్థాన్ (4.63) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డబ్ల్యూటీసీ లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల శాతంలో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో రాబోయే టెస్టుల్లో ప్రతి జట్టుకూ పాయింట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఐదవ స్థానంలో ఉన్న టీమిండియా.. ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.
Also Read
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
తాజావార్తలు
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!