Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP and Telangana Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ద్రోణి విస్తరించడంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఏపీలో 15 జిల్లాలకు వర్ష సూచన:
ఆంధ్రప్రదేశ్లోని మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ సహా 15 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ద్రోణి విస్తరణ, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు:
తెలంగాణలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ మధ్య పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణశాఖ నుంచి వచ్చే తాజా సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సాధారణం కంటే పెరిగిన ఉష్ణోగ్రతలు:
మరోవైపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. బుధవారం సాధారణంగా 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వాల్సి ఉండగా.. 5.9 డిగ్రీలు అధికంగా 37.9 డిగ్రీలకు చేరింది. ఖమ్మంలో సాధారణం కంటే 3.7 డిగ్రీలు ఎక్కువగా 35.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లోనూ సాధారణం కంటే 2.2 డిగ్రీలు అధికంగా 33.9 డిగ్రీలు నమోదైంది.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..