Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satyaprasad: ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో 22ఏ భూములపై చర్చ సాగుతోన్న వేళ.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ భూ సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన మరో 4 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూములపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. శతాబ్దాలుగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. వట్టిచెరుకూరు, శెట్టిపల్లి, పుల్లడిగుంట, కంగుంది, అవులపల్లి, గూటుపల్లి, కోనసీమ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో వేలాది మందికి వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించినట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కక్షపూరితంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 28 లక్షల ఎకరాలను ఆ జాబితా నుంచి తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. 22ఎ జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెం.444 ద్వారా సమగ్ర ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు అనగాని.. జీవో 444 తర్వాత 22ఏ జాబితా నుంచి 28,790 ఎకరాలను తొలగించాలని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇప్పటివరకు 1,100 ఎకరాలను తొలగించినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన దరఖాస్తులపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
అదేవిధంగా కొత్తగా ఏదైనా భూమిని 22ఎ నిషేధిత జాబితాలో చేర్చేందుకు స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తూ జీవో నెం.445 జారీ చేసినట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ప్రైవేట్ భూమిని 22ఎ జాబితాలో చేర్చాలంటే, ఆ భూమి నిషేధిత జాబితాలో చేర్చాల్సిన కారణాలను సంబంధిత అధికారే నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22ఎ జాబితాలో చేర్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ‘మీ భూమి–బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ’ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించారు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
తాజావార్తలు
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?