CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో Gen Z కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Gen Z అంటే ఏదో ప్రత్యేకమైన విషయం కాదని, తమకు సరైన న్యాయం జరగలేదని అనిపిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారని అన్నారు. ప్రజల సమస్యలను ఏసీ గదుల్లో కూర్చొని పట్టించుకోకపోతే కడుపుమండినవారు ఏం చేస్తారో.. ప్రస్తుతం Gen Z కూడా అదే చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అధికారులు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులకు మానవీయ కోణం ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సానుభూతితో, మానవీయ దృక్పథంతో పాటు సరైన ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను కేవలం అధికారిక ప్రక్రియగా కాకుండా, వారి పరిస్థితిని అర్థం చేసుకుని పరిష్కరించే విధంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఉత్పాదకంగా ఉండేలా ఆలోచించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు మొత్తం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇందులో ఒక్క పెన్షన్లకే రూ.73 వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్ల వరకు ఖర్చు చేశామని వెల్లడించారు. కేవలం నగదు పంపిణీ చేస్తూ ఉంటే ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వ నిధులను ఉత్పాదకంగా వినియోగించాలని సూచించారు. ప్రజల ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించేలా అధికారులు ఆలోచించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?