AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌటింగ్ మొదలయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బ్యాలెట్లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రీపోలింగ్ సెంటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్ స్టార్టయ్యింది. మధ్యాహ్నానికి కౌంటింగ్ ట్రెండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రికి పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
Also Read
- Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!
- IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
- Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
- India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
-
03 Nov 2026 11:05 AM (IST)
యలమంచిలి కౌంటింగ్‌పై గందరగోళం!
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో కౌంటింగ్‌పై గందరగోళం నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ వివరాలు వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓ వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపులో ఓటు మిస్ అయినట్లు సమాచారం. లేఖ కూడ లభ్యం కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
-
03 Nov 2026 11:03 AM (IST)
డోన్ మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో వైసీపీ గెలుపు!
నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. 3,7,8,9 వార్డుల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది.
-
03 Nov 2026 10:52 AM (IST)
పులివెందుల పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ముందంజ!
కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ముందంజలో ఉంది.
పోస్టల్ బ్యాలెట్ చైర్మన్ అభ్యర్థి ఓట్లు వివరాలు:
తెలుగుదేశం - 61
వైసీపీ -84
నోట - 4
ఇన్వలిడ్ -1
-
03 Nov 2026 10:49 AM (IST)
పిఠాపురం ఒకటో వార్డులో వైసీపీ రెబల్ విజయం!
కాకినాడ జిల్లా పిఠాపురం ఒకటో వార్డులో వైసీపీ రెబల్ విజయం సాధించారు. 9వ వార్డులో టీడీపీ రెబల్ గెలుపొందారు. రెండో వార్డులో టీడీపీ, ఎనిమిదో వార్డులో వైసీపీ అభ్యర్థులు విజయం అందుకున్నారు. 3,4,5,6,7 వార్డులలో జనసేన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
-
03 Nov 2026 10:47 AM (IST)
పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. రెండో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యం!
చైర్మన్ అభ్యర్థి టీడీపీకి 3,037 ఓట్లు.. వైసీపీకి 2,708 ఓట్లు
వైసీపీ చైర్మన్ అభ్యర్థిపై టీడీపీకి 329 ఓట్ల ఆధిక్యం
ఇండిపెండెంట్ అభ్యర్థికి 54 ఓట్లు
10వ వార్డులో టీడీపీ 166.. వైసీపీ 234
11వ వార్డులో టీడీపీ 167.. వైసీపీ 239
13వ వార్డులో టీడీపీ 221.. వైసీపీ 163
14వ వార్డులో టీడీపీ 233.. వైసీపీ 207
15వ వార్డులో టీడీపీ 213.. వైసీపీ 164
10, 11వ వార్డుల్లో వైసీపీ ఆధిక్యం
13, 14, 15వ వార్డుల్లో టీడీపీ ఆధిక్యం
-
03 Nov 2026 10:44 AM (IST)
పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ దూకుడు!
పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. 99 శాతం మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్స్‌లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఉద్యోగులంతా మావైపే ఉన్నారని టీడీపీ అంటోంది. విశాఖ, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా.. ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ లీడ్‌లో ఉంది. తిరువూరు, మడకశిర, అమలాపురం, నర్సాపురం పోస్టల్ బ్యాలెట్లో జనసేన ఆధిక్యంలో కొనసాగుతోంది.
-
03 Nov 2026 10:30 AM (IST)
తిరువూరు పోస్టల్ బ్యాలెట్లో కూటమి ఆధిక్యం!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయింది. తొలి రౌండ్లో కూటమి అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు.
చైర్మన్ అభ్యర్థుల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు:
కూటమి – 61 ఓట్లు
వైసీపీ – 38 ఓట్లు
కాంగ్రెస్ – 1 ఓటు
ఇన్వాలిడ్ (చెల్లని ఓట్లు) – 1
-
03 Nov 2026 10:25 AM (IST)
ఆత్మకూరు 27 వార్డులో వైసీపీ అభ్యర్థి విజయం!
ఆత్మకూరు మున్సిపాలిటీలోని 27 వార్డులో వైసీపీ అభ్యర్థి మారుపోతుల విజయకుమార్ గెలుపొందారు.
-
03 Nov 2026 10:23 AM (IST)
కుప్పంలో బోణి కొట్టిన టీడీపీ!
చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బోణి కొట్టింది. 11వ వార్డులో 530 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కళా మురుగేష్ విజయం సాధించారు.
-
03 Nov 2026 10:21 AM (IST)
కళ్యాణదుర్గంలో బోణి కొట్టిన వైసీపీ!
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ బోణీ కొట్టింది. 4, 14వ వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
-
03 Nov 2026 10:17 AM (IST)
కళ్యాణదుర్గంలో టీడీపీ హవా!
కళ్యాణదుర్గంలో టీడీపీ హవా కొనాగుతోంది. 1, 2, 3, 10, 11, 12, 16 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. కళ్యాణదుర్గం 9వ వార్డులో జనసేన విజయం సాధించింది.
-
03 Nov 2026 10:12 AM (IST)
పలుచోట్ల కౌంటింగ్‌కు వర్షం దెబ్బ!
ఏపీలో పలుచోట్ల కౌంటింగ్‌పై వర్షం ప్రభావం చూపుతోంది. బెజవాడ కార్పొరేషన్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఎడతెరిపిలేని వర్షంతో ఇంకా కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకోలేదు. రేపల్లెలో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. తుఫాన్ ప్రభావంతో రేపల్లెలో మరో గంట తర్వాత కౌంటింగ్ ప్రారంభమయ్యే చాన్స్ ఉంది.
-
03 Nov 2026 10:07 AM (IST)
పెద్దాపురంలో జనసేన హవా!
3వ వార్డులో 773 ఓట్లుతో జనసేన విజయం
5వ వార్డులో 650 ఓట్ల తేడాతో జనసేన విజయం
7వ వార్డులో 700 ఓట్ల తేడాతో జనసేన విజయం
-
03 Nov 2026 10:00 AM (IST)
నందికొట్కూరులో పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ఆధిక్యం!
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది.
మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 82
టీడీపీ - 45
వైసీపీ - 31
ఇండిపెండెంట్ - 6
-
03 Nov 2026 09:57 AM (IST)
మాచర్లలో పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ఆధిక్యం!
పల్నాడు జిల్లా మాచర్లలో మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది.
మొత్తం ఓట్లు - 68
చెల్లని ఓట్లు - 2
తెలుగుదేశం - 59
గాలి బుడగ - 1
పండ్ల బుట్ట - 1
వైసీపీ బలపరిచిన బీరువా గుర్తు - 4
నోటా - 1
-
03 Nov 2026 09:55 AM (IST)
ఉయ్యూరు పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ఆధిక్యం!
ఉయ్యూరు మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. అలానే పెడన పోస్టల్ బ్యాలెట్లో కూడా వైసీపీ లీడ్‌లో ఉంది. యలమంచిలి పోస్టల్ బ్యాలెట్లో సమాన ఓట్లు పోలయ్యాయి.
-
03 Nov 2026 09:46 AM (IST)
నరసాపురం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడి!
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 18 ఓట్లకు గాను జనసేన అభ్యర్థి కొత్తపల్లి శైలజకు 12 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి కావలి రామ సీతకు 4.. కాంగ్రెస్ అభ్యర్థి సంతోషి కుమారికి 2 ఓట్లు రాగా.. ఒకటి చెల్లని ఓటు ఉంది.
-
03 Nov 2026 09:41 AM (IST)
ఇండిపెండెంట్ అభ్యర్థి లీడ్!
నెల్లిమర్ల నగర పంచాయతీ పోస్టల్ బ్యాలెట్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
-
03 Nov 2026 09:38 AM (IST)
టీడీపీ, జనసేన విజయం!
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 10వ వార్డులో టీడీపీ విజయం సాధించింది. పెద్దాపురం మున్సిపాలిటీ 3వ వార్డులో జనసేన జయకేతనం ఎగురవేసింది.
-
03 Nov 2026 09:35 AM (IST)
వైఎస్ జగన్‌పై కేసు నమోదు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఆర్వో ఆఫీసు ముందు జగన్ ధర్నా చేశారు. పోలింగ్ రోజే పులివెందుల పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ జగన్‌పై కేసు నమోదయింది. జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పైనా కేసు నమోదైంది.
-
03 Nov 2026 09:08 AM (IST)
పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
ఏపీలో పలు మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. విశాఖలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముందంజలో ఉండగా.. అమలాపురం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో జనసేన అధిక్యంలో ఉంది.
-
03 Nov 2026 09:05 AM (IST)
జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రం తాళాలు మిస్సింగ్!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రం తాళాలు మిస్ అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో తాళాలు మిస్సయ్యాయి. తాళాలు కనిపించకపోవడంతో అధికారులు లాక్ ను బద్దలుకొట్టారు.
-
03 Nov 2026 08:59 AM (IST)
నిడదవోలులో ఇంకా ప్రారంభం కాని కౌంటింగ్ ప్రక్రియ!
తూ.గో. జిల్లా నిడదవోలులో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా కౌంటింగ్ కేంద్రానికి ఆలస్యంగా సిబ్బంది చేరుకుంటున్నారు. తుఫాన్ ప్రభావంతో నిడదవోలులో ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది.
-
03 Nov 2026 08:57 AM (IST)
చిత్తూరు మేయర్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం!
చిత్తూరు మేయర్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యంలో ఉంది.
-
03 Nov 2026 08:54 AM (IST)
ప్రారంభంకాని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్!
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. సిబ్బంది కౌంటింగ్ హాల్స్ కు పూర్తిగా చేరుకోలేదు. నాలుగు స్ట్రాంగ్ రూంలలో రెండింటిని అధికారులు ఇంకా ఓపెన్ చెయ్యలేదు. దాంతో కౌంటింగ్ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
-
03 Nov 2026 08:40 AM (IST)
కనిపించని స్ట్రాంగ్ రూమ్ తాళం!
పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. స్ట్రాంగ్‌రూమ్ తాళం కనిపించకపోవడంతో.. లెక్కింపు మొదలు కాలేదు.
-
03 Nov 2026 08:29 AM (IST)
నందిగామలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రంలో సిబ్బంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి నందిగామలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. చైర్మన్, వార్డు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది వర్షంలోనే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. అనంతరం చైర్మన్, వార్డు అభ్యర్థులకు పోలైన బ్యాలెట్ పత్రాలను సిబ్బంది వేరు చేసే ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత ఆయా బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.
-
03 Nov 2026 08:27 AM (IST)
చిలకలూరిపేటలో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం!
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుఫాన్ ఎఫెక్ట్ చూపింది. చిలకలూరిపేటలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. 8 గంటలకు కూడా సిబ్బంది ఇంకా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేదు. దాంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
-
03 Nov 2026 08:25 AM (IST)
బెజవాడ ఎన్నికల కౌంటింగ్‌పై మురసు తుఫాన్ ప్రభావం!
బెజవాడ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్‌పై మురసు తుఫాన్ ప్రభావం చూపింది. బెజవాడలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోలేదు. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 8 గంటలకు ప్రారంభం కావలసిన కౌంటింగ్.. అరగంట ఆలస్యం అవుతుందని అధికారులు అంటున్నారు.
-
03 Nov 2026 08:21 AM (IST)
ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఓట్ల లెక్కింపులో మార్పు!
ప్రకాశం, బాపట్ల జిల్లాలలో అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయాన్ని ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11:30 గంటలకు మార్పు చేసింది ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం. 'మురసు' తుఫాన్ కారణంగా ఈ రెండు జిల్లాల్లో కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 10:30 గంటలకు ఎన్నికల సంఘం వాతావరణ పరిస్థితిని మళ్లీ సమీక్షిస్తుంది. వర్షాలు తగ్గకపోతే తదుపరి నిర్ణయం ప్రకటిస్తుంది.
-
03 Nov 2026 08:19 AM (IST)
ఆదోనిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యం!
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యం కానుంది. టిఫిన్ ఆలస్యం కావడంతో కౌంటింగ్ సిబ్బంది వేచి ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా.. సిబ్బందికి టిఫిన్ అందలేదు. సమయానికి టిఫిన్ అందకపోవడంతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.
-
03 Nov 2026 08:16 AM (IST)
రేపల్లెలో ఓట్ల లెక్కింపు ఆలస్యం!
బాపట్ల జిల్లా రేపల్లెలో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. మురసు తుఫాన్ కారణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మార్పు జరిగింది. ఉదయం 7 గంటలకు తెరవాల్సిన స్ట్రాంగ్ రూమ్‌ను 10 గంటలకు తెరవాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
-
03 Nov 2026 08:14 AM (IST)
కౌంటింగ్ ప్రారంభం!
ఏపీ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.
-
03 Nov 2026 08:10 AM (IST)
పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌కు లైన్ క్లియర్!
పులివెందులలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌంటింగ్ నిలిపివేయాలంటూ పులివెందుల వైసీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఎస్ఈసీ రీపోలింగ్ నిర్వహించిన నాలుగు వార్డుల్లోనే కాకుండా.. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మిగతా అన్ని వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని, అప్పటివరకు అక్కడ కౌంటింగ్ నిలిపేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం ఉదయం 7.30 గంటలకు హైకోర్టు తీర్పు వెలువరించింది.
ట్రెండింగ్
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?