Adimulapu Suresh: కర్నూలు జిల్లా పత్తికొండలో సామాజిక సాధికారక బస్సు యాత్రలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాష , మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తదని విద్యార్థులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బీసీలను 14 ఏళ్లు మోసం చేసాడని అన్నారు.
Also Read: Purandeshwari: అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది..
సామాజిక సాధికారిక విధానాన్ని సీఎం జగన్ నిరూపించారని డిప్యూటీ సీఎం అంజద్ భాష అన్నారు. సీఎం జగన్ మంత్రివర్గంలో 80 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు ఇచ్చారని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు 14 ఏళ్లుగా చంద్రబాబుకు గుర్తుకు రాలేదని.. ఒక ఓటర్‌గా మాత్రం గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు గుంపులుగా వస్తాయి… సింహం జగన్ సింగిల్‌గా వస్తారన్నారు. జగన్ దేవుణ్ణి, రాష్ట్ర ప్రజలను నమ్ముకున్నారన్నారు. పత్తికొండ నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమని.. మొట్టమొదటిసారి మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీదేవినే ప్రకటించారని చెప్పారు.
Also Read: AP Ministers: పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యం..
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్ అని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ గత 40 ఏళ్లుగా మర్రిచెట్టు లాగా ఉండేవాళ్లు, ఇప్పుడు మర్రి చెట్టు కింద తులసిచెట్టులా వచ్చారని ఆయన పేర్కొన్నారు. చిన్న పల్లె నుంచి వచ్చిన నాకు మంత్రి పదవి ఇచ్చి సీఎం జగన్ నా తలరాత మార్చారంటూ మంత్రి జయరాం గుర్తు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలలో గెలిపిస్తామని సీఎం జగన్‌కు హామీ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.