వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో సామాజిక సాధికారక బస్సు యాత్రలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాష , మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలకృష్ణ ఆరోపిస్తున్నారని.. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పనిపడతారని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు…