Minister TG Bharath: ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్..100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం
- ఏపీకి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తాం
- 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తాం
- ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్
- పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిస్తే చాలు పెట్టుబడులు వస్తాయన్న మంత్రి టీజీ భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharath: వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే.. వాటాలు అడిగే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఏపీకి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని.. 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: DSPs Transfer: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఒకేసారి 96 మంది డీఎస్పీల బదిలీ..
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని పరిశ్రమల కోసం తెస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్ అని.. పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిస్తే చాలు పెట్టుబడులు వస్తాయన్నారు. పరిశ్రమలకు కావాల్సిన అనుమతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరలను గత ప్రభుత్వం అమాంతం పెంచేసిందని.. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరలను తగ్గిస్తామన్నారు. కొత్తగా నాలుగు ఇండస్ట్రీటల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేట ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. శ్రీ సిటీ తరహాలో ఇండస్ట్రీయల్ పార్కులను డెవలప్ చేస్తామన్నారు. పీపీపీ మోడల్‌లో ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గతంతో పోల్చుకుంటే పారిశ్రామిక వేత్తల ఫ్లో అనేది పెరిగిందన్నారు. హోటళ్లల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగిందన్నారు. బీపీసీఎల్ పెట్టుబడులు పెట్టబోతోందని.. బీపీసీఎల్ రిఫైనరీ పెట్టేందుకు నాలుగు ప్రాంతాలను ఆప్షన్‌గా ఇచ్చామని మంత్రి టీజీ భరత్ చెప్పారు. మూలపేట, కాకినాడ, రామాయపట్నం, బందరు ప్రాంతాల్లో బీపీసీఎల్ రిఫైనరీ పెట్టాలని ప్రతిపాదనలు పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వ తీరుతో కియా అనుబంధ పరిశ్రమలు పారిపోయాయని.. కియా అనుబంధ పరిశ్రమలు విస్తరణ ఏమైనా చెప్పట్టాలంటే మేం సహకరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu: 5 నూతన పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఎంఎస్‌ఎంఈలకు రూ. 500 కోట్లు ప్రోత్సాహకాలు పెండింగులో ఉన్నాయన్నారు. పెండింగులో ఉన్న ఇన్సెంటీవ్స్‌ను కచ్చితంగా ఇస్తామని.. అయితే ఎప్పటిలోగా చేయగలమనేది చూస్తామన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచేయడం వల్ల చాలా పరిశ్రమలు భయపడిపోయాయని ఆయన తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం.. ఎన్ని గ్రౌండ్ అయ్యాయి.. ఇంకా గ్రౌండ్ కానివి ఏంటీ..? అనేది విశ్లేషిస్తున్నామని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు నైపుణ్యం పెంచేలా చేస్తామన్నారు. నైపుణ్యం ఉంటే.. స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దొరికితే.. కంపెనీలు వాళ్లనే రిక్రూట్ చేసుకుంటాయని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!