NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు పొత్తుల వ్యవహారం ఊహించిందే.. ఎంతమంది కలిసినా జగన్‌ సింగిల్‌గానే..!

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగుతుంటే.. మరోవైపు ఎన్నికల పొత్తులపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆ పొత్తుల వ్యవహారం ఊహించిందే అంటున్నారు. వాపక్షాలు ప్రత్యక్షంగా.. కాంగ్రెస్‌ పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇస్తున్నాయన్న ఆయన.. ఇక, బీజేపీ నేతలంతా టీడీపీ నుంచి వెళ్లినవారే అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ఎంత మందితో కలిసి వచ్చినా.. మా నాయకుడు సింగిల్‌గానే వస్తాడని చెబుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Read Also: Lal Salaam Trailer: ట్రైలర్ చూసాకా.. అందరికి అదే డౌట్ వస్తుంది మావా

అనంతపురంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అనంతపురంలో ఈ నెల 11న జరగాల్సిన సిద్ధం బహిరంగ సభ 18కి వాయిదా వేసినట్టు తెలిపారు.. ఈ నెల18న సిద్ధం బహిరంగసభ ఉంటుందన్నారు.. ఇక, తాజా రాజకీయాలపై స్పందిస్తూ.. ముందు నుండి ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ టీడీపీకే ఇస్తుందన్నారు. బీజేపీలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారన్న ఆయన.. ఎంతమంది కలిసినా మాకు ఆశ్చర్యం లేదు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సింగిల్ గా వస్తారని స్పష్టం చేశారు. ఇక, భద్రత లేదని షర్మిలా మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు మాకు ఉన్న రక్షణ తొలగించారని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మా మద్దతుతో గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారన్నారు. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.