Minister Narayana: విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సహకారం అందించండి..
- విజయవాడ..విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సహకారం అందించండి
- అమృత్ 2 పథకం పనుల కొనసాగింపునకు సహకరించండి
- కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్‌కు ఏపీ మంత్రి నారాయణ ప్రతిపాదనలు
- ఢిల్లీలో రెండోరోజు కొనసాగిన మంత్రి నారాయణ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana Delhi Tour: విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు ఏపీ పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ..రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్ తో నారాయణ భేటీ అయ్యారు..ఈ భేటీలో మంత్రి నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా పాల్గొన్నారు..2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేసారు…2015 వ సంవత్సరంలోనే డీపీఆర్‌లు కూడా సిద్ధం అయ్యాయి.. ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగాయి.. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్ట్ లను ఏమాత్రం పట్టించుకోలేదు.. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించింది..ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించి తాజా నివేదికలు సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఢిల్లీలో కేంద్రమంత్రి ఖట్టర్‌తో భేటీ సందర్భంగా తాజా ప్రతిపాదనలతో పూర్తి వివరాలు అందించారు మంత్రి నారాయణ…గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్ట్ లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు..మరోవైపు విజయవాడ మెట్రో ను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు నారాయణ.
అమృత్ 2 పథకం పనుల కొనసాగింపునకు సహకరించండి..
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
మరో వైపు అమృత్ 2 పథకం అమలుపైనా ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది…అమృత్ పథకం కింద రాష్ట్రంలోని పలు మున్సిపాల్టీల్లో వివిధ అభివృద్ది పనులను చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం…నాటి టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు అభివృద్ది పనులను వైసీపీ ప్రభుత్వం కొనసాగించలేదు..పైగా అమృత్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ప్రాజెక్ట్ మొత్తం నిలిచిపోయింది..గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమృత్ పథకం అమలుకు నోచుకోలేదని..ఆ పథకాన్ని ఇప్పుడు కొనసాగించాలని కోరారు..మంత్రి నారాయణ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు…
తాజావార్తలు
-
NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
-
Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
-
క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
-
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..