AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Elections Polling Stations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల అనుమతితో అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఈ జాబితాను వెల్లడించినట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 12న గ్రామపంచాయతీల పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది. అనంతరం గత నెల 23న పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రచురించారు. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు గత నెల 26 వరకు అవకాశం కల్పించారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను సిద్ధం చేశారు.
తాజా జాబితా ప్రకారం.. రాష్ట్రంలోని 13,278 గ్రామపంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు మొత్తం 1,36,326 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో గ్రామపంచాయతీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ఈ జాబితాను ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు అందించిన అనుమతులు, సూచనల ఆధారంగా తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను రూపొందించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. డ్రాఫ్ట్ జాబితా తర్వాత వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొంది.
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురణతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన కీలక ప్రక్రియలో మరో దశ పూర్తయింది. ఇక తదుపరి ఎన్నికల ఏర్పాట్లు, ఇతర షెడ్యూల్‌కు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!