AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా.. 8 చోట్ల ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 92 స్థానిక సంస్థల్లో ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Also Read
- Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
- AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
01 Nov 2026 09:59 AM (IST)
ఎన్నికలను అడ్డుకోవాలనే ఇలా: మంత్రి కందుల దుర్గేష్
మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణ సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆరోపిస్తున్నారు. రాయలసీమలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణకు దిగి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. అయినా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అంటున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటానికి మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
-
01 Nov 2026 09:57 AM (IST)
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్రశాంతంగా పోలింగ్!
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఉదయం 9 గంటల వరకు పోలింగ్ వివరాలు:
మొత్తం వార్డులు: 32
మొత్తం ఓటర్లు: 36,622
పోలైన ఓట్లు: 1,997
పోలింగ్ శాతం: 5.45%
-
01 Nov 2026 09:56 AM (IST)
విజయవాడ 55వ డివిజన్లో తిరిగి ప్రారంభమైన పోలింగ్!
విజయవాడ 55వ డివిజన్లో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీ చర్యలతో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. 55వ డివిజన్ పరిధిలో అభ్యర్థుల గుర్తులు తారుమారు కాగా.. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. యుద్ధప్రాతిపదికన కొత్త బ్యాలెట్ పేపర్లను ఎన్నికల అధికారులు ప్రింట్ చేయించారు. గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించిన యంత్రాంగం పోలింగ్‌ను పునఃప్రారంభించింది. ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ నెంబర్ 98854 65827కు సమాచారం అందించాలని చెప్పారు.
-
01 Nov 2026 09:53 AM (IST)
వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!
కర్నూలులోని ఎమ్మిగనూరు గోనెగండ్ల బైపాస్ దగ్గర ఉద్రిక్తత నెలకొందో. వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డిని సిటీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి.
-
01 Nov 2026 09:21 AM (IST)
టీడీపీ బూత్ ఏజెంట్‌పై దాడి!
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సత్తెనపల్లి 19వ వార్డులో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేయుకుంది. టీడీపీ బూత్ ఏజెంట్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
-
01 Nov 2026 09:16 AM (IST)
వైసీపీ కార్యకర్తలకు గాయాలు!
పులివెందుల 38వ వార్డు పరిధిలోని సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడినట్లు వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. 18వ వార్డు యర్రగుడిపల్లి వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరగగా.. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వరుస ఘటనలతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
-
01 Nov 2026 09:15 AM (IST)
వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు, రాళ్ల దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి జరిగింది. 21వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో ఆమెపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
-
01 Nov 2026 09:01 AM (IST)
ఓటు హక్కును వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు!
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు ఒకటవ బూత్ లో బాలకృష్ణ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 'ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వారి ప్రాథమిక హక్కు. పనిచేసే వారికి ఓటెయ్యాలి, పనిచేయని వారికి ఓటేయరాదు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటెయ్యాలి' అని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.
-
01 Nov 2026 08:47 AM (IST)
85 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్!
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ నిఘా ముమ్మరం చేశారు. కార్పొరేషన్ పరిధిలో 85 మంది రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ సమస్య ఆత్మకు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
-
01 Nov 2026 08:45 AM (IST)
వైసీపీ కార్యకర్తలకు గాయాలు!
పులివెందుల సరస్వతి విద్యామందిర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 38వ వార్డు దగ్గర వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
-
01 Nov 2026 08:29 AM (IST)
విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ పొరపాటు కలకలం రేపింది. నగరంలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓల్డ్ రాజరాజేశ్వరి పేట 55వ డివిజన్లో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఎన్నికల గుర్తులు తారుమారుగా ముద్రితమయ్యాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ డివిజన్లో పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. 55వ డివిజన్లో రెండు గంటల పాటు పోలింగ్ ఆలస్యం కానుంది.
-
01 Nov 2026 08:16 AM (IST)
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత!
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించడంలేదని వైసీపీ ఆందోళన చేపట్టింది. వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వెంకటచలపతి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
-
01 Nov 2026 07:57 AM (IST)
ఓటు హక్కు వినియోగించుకున్న ఏబీ వేంకటేశ్వర రావు!
విజయవాడలో తన ఓటు హక్కును ఏబీ వెంకటేశ్వరరావు వినియోగించుకున్నారు. 'ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం మంచి పరిణామం. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నిన్న కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా మావాళ్లు వీడియోలు రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను' అని ఎన్టీవీతో ఏబీవీ ప్రతేకంగా చెప్పారు.
-
01 Nov 2026 07:51 AM (IST)
పులివెందుల 27వ వార్డు పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత!
పులివెందుల 27వ వార్డు పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వృద్ధురాలి చేతిలోని బ్యాలెట్ స్లిప్‌ను టీడీపీ ఏజెంట్లు లాక్కున్నారు. పులివెందుల సత్రం స్కూల్ పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
-
01 Nov 2026 07:35 AM (IST)
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్ అయ్యారు. కొందరు వైసీపీ నేతలను బైండోవర్ చేసి.. పోలీస్ స్టేషన్లకు తరలించారు.
-
01 Nov 2026 07:25 AM (IST)
బెజవాడ కార్పొరేషన్లో అభ్యర్థుల గుర్తులు తారుమారు!
బెజవాడ కార్పొరేషన్లో అభ్యర్థుల గుర్తులు తారుమారు అయ్యాయి. 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారయ్యాయి.
-
01 Nov 2026 07:19 AM (IST)
ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్!
మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!