High Court Judgement: ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు (శుక్రవారం) కీలక విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆరు నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించి తీరాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు సాధించారు. అయితే ట్రాన్స్ జెండర్ల కోసం ఎటువంటి పోస్టులను నోటిఫై చేయకపోవడంతో నియామక ప్రక్రియలో రేఖను పరిగణనలోకి తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మొదట్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనప్పుడు మేము ఏమి చేయలేమని పేర్కొంది.
KTM Recalls: KTM బైక్ వాహనదారులకు అలర్ట్.. కంపెనీ ఈ మోడల్స్ డ్యూక్లను రీకాల్.. చెక్ చేసుకోండి
అయితే, ట్రాన్స్ జెండర్ల హక్కులు, సమాన అవకాశాల ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకుని, ట్రాన్స్ జెండర్ల రిజర్వేషన్లపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరు నెలల్లోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ఈ ఆదేశాలతో ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు లభించేందుకు మార్గం సుగమం కానుంది.
Betting Apps : బెట్టింగ్ కోసం షాకింగ్ మర్డర్..! ఇంజినీరింగ్ స్టూడెంట్ అరెస్ట్