APPSC Group 1 Main Exam: గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APPSC Group 1 Main Exam 2018 Canceled: తాజాగా ఏపీ హైకోర్టు 2018 లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ను రద్దు చేసింది. ఈ పరీక్షలకి సంబంధించి ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 22, 2022లో 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అయితే ఇందులో అనుమానాలున్నాయని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను నిలిపి వేయడం జరిగింది. ఈ ప్రక్రియకి సంబంధించి జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని ఏపీపీఎస్సిని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాబోయే 6 నెలల లోపై ఎగ్జామ్ తిరిగి పెట్టాలని చెప్పింది.
ఇక మరోవైపు చూస్తే.. ప్రస్తుతం జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్స్ కు సర్వం సిద్ధమైంది. ఏపీపీఎస్సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను మార్చి 17న నిర్వహించబోతుంది. ఆఫ్‌లైన్ లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష పేపర్ 1, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 ను రెండు షిఫ్టులలో జరుపనున్నారు. ఈ పరిక్షలు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష జరగబోతుంది. జరగబోయే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత అయినవారు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఈ నోటిఫ్కేషన్ లో మొత్తం 81 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరిక్ష నిర్వహిస్తోంది.
Also Read
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Also Read: Yarlagadda Venkat Rao: ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే: యార్లగడ్డ
ఇక ఈ పరీక్ష అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం.. ముందుగా APPSC అధికారిక పోర్టల్ psc.ap.gov.in ని సంప్రదిందించాలి. ఆపై హోమ్‌పేజీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ – 2024 డౌన్‌లోడ్ లింక్ ను వెతకాలి. ఆపై వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఇచ్చి లాగిన్ అవ్వాలి. దాంతో మీ ఏపీపీఎస్సీ హాల్ టిక్కెట్ 2024 స్క్రీన్ పై కనపడుతుంది.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!