భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్-2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మారుస్తూ జీవో తెచ్చినట్లు తెలిపారు.
READ MORE: Accident : ఘోరం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రవెల్స్ బస్సు.. నలుగురు మృతి
“లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు. బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశాం. 500 చ.మీ పైబడిన స్థలాల్లో నిర్మాణాల్లో సెల్లారుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్‌లు తొలగిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12 మీ. సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన తొలగించాం. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేశాం. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశాం. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుంది.” అని మంత్రి నారాయణ తెలిపారు.
READ MORE:Shamshabad: కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?