ఏపీలో రోసా రూల్స్ (ROSA Reorganization of service associations)మార్పు చేర్పులపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోసా రూల్స్ మార్పు చేర్పులపై ప్రభుత్వంతో ముగిసిన ఉద్యోగ సంఘాలర ప్రతినిధుల సమావేశం ముగిసింది. రోసా రూల్స్ మార్పు చేర్పులపై ఉద్యోగ సంఘాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రోసా రూల్సును సమూలంగా మార్చాలంది ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.రూల్సును సక్రమంగా అమలు చేస్తే చాలునని.. మార్పులు చేర్పులు అవసరం లేదన్నాయి ఏపీ జేఏసీ సహా ఇతర సంఘాలు.నిబంధనలను విరుద్దంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి.. పండిత పరిషత్ సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చోటు కల్పించారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.
రోసా రూల్స్ మార్పు చేర్పులపై కమిటీ వేసిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ జరిగింది. రోసా రూల్స్ మార్పు చేర్పులపై అభిప్రాయాలు తెలిపేందుకు సోమవారం సాయంత్రంలోగా ఓ ఫార్మెటును ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్న ప్రభుత్వం.అభిప్రాయాలు చెప్పేందుకు 15 రోజుల గడువు విధించిన ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ రోసా రూల్సును సమూలంగా మార్చాలి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అర్హతతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన సంఘాలకు గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు లేకుండా ఉండాలంటే రోసా రూల్స్ మార్చాల్సిన అవసరం ఉంది. పిక్ అండ్ చూస్ విధానాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Weather Update: ఏపీలో గురువారం వడగాల్పులు….బయటకు వెళితే అంతే సంగతులు
ఏ సంఘానికి ఆ సంఘం అని కాకుండా.. అందరికీ కలిపి ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నిక జరపాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. రోసా రూల్స్ మార్పు చేర్పుల మీదే కాకుండా.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిబంధనలను కూడా మార్చాలని మేం ప్రభుత్వాన్ని కోరాం.చాలా ఉద్యోగ సంఘాల్లో ద్వంద్వ సభ్యత్వం ఉంది. ఇది తప్పుడు దీన్ని విధానం.. దీన్ని సరిద్దిదాలని కోరతాం అన్నారు సూర్యనారాయణ. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రోసా రూల్స్ మార్చాల్సిన అవసరం లేదు.. వాటిని యధాతథంగా కొనసాగించాలి.. సక్రమంగా అమలు చేయాలి.ప్రస్తుతమున్న రూల్సును సమూలంగా మార్చాలని కొన్ని సంఘాలు చేస్తున్న వాదన సరైంది కాదు.ఇంటిలో ఎలుక దూరిందని.. ఇంటిని తగులపెట్టుకోవడం సరైన పని కాదని.. ఎలుకను తరిమి కొట్టాలని మేం అధికారులకు చెప్పాం.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, పండిత పరిషత్ సంఘాలు నిబంధనలు అతిక్రమించి.. రిలాక్సేషన్ తీసుకుని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి వచ్చాయి.ఉద్యోగులందరికీ ఉమ్మడిగా ఎన్నికలు జరగాల్సిన అవసరం లేదు.ట్రేడ్ యూనియన్ సంఘాల మాదిరిగా ఉద్యోగ సంఘాలకు ఉమ్మడి ఎన్నికలు జరగవు.
ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయ్ రాజ్ మాట్లాడుతూ.. ద్వంద్వ సభ్యత్వం అంటూ కొన్ని సంఘాలు కొత్త వాదనను తెర లేపుతున్నాయి. కొన్ని సంఘాల్లో ప్రత్యేకంగా వారి వారి సమస్యల గురించి పోరాడతాయి. అలాగే ఉమ్మడి సమస్యలపై వేరే సంఘాల్లోనూ సభ్యత్వం ఉంటుంది… దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు హృదయ్ రాజ్. ఈ విషయంలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంది.
Read Also: Viral News : కూలీగా మారిన అసిస్టెంట్ ప్రొఫెసర్