Gunmens for Minister Son: మంత్రి వేణుగోపాల్ తనయుడికి గన్ మెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆర్డర్ వేస్తే ఇంకేముంది? ఓ మంత్రిగారి కొడుక్కి గన్ మెన్ల నియామకం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తనయుడు నరేన్ కి గన్ మెన్ లను కేటాయించింది ప్రభుత్వం. వేణుగోపాల్ తనయుడు నరేన్ కి 1+1 గన్ మెన్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తన తండ్రి మంత్రి హోదా లో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నందున ఆయన తరపున రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు తాను చూసుకుంటున్నానని తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు నరేన్.
Read Also: Sharad Pawar: అదాని, అంబానీలపై దాడి చేయడం కరెక్ట్ కాదు
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి తరఫున గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు నరేన్. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా చెల్లుబోయిన వేణుగోపాల్ కు జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు.2008 నుండి 2012 వరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

Vens1
జెడ్పీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ జగన్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరారు వేణుగోపాల్. 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఎన్నికల్లో ఆయన రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాది తర్వాత జగన్ కేబినెట్లోకి వేణుగోపాల్ కు స్థానం దక్కింది. ప్రస్తుతం సీఎం జగన్ కి నమ్మకస్తుడిగా ఉన్న వేణుగోపాల్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంత్రి కొడుక్కి గన్ మెన్లను కేటాయించడం పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది.
Read Also: Post Office : పోస్టాఫీసులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.2.5 లక్షల వడ్డీ
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!