Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్.. గంజాయికి సంబంధించి సమాచారమిస్తే నగదు రివార్డు
- గంజాయి కట్టడికి సన్నద్ధమైన ఏపీ సర్కారు
- గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు టోల్ ఫ్రీ నంబర్
- గంజాయిపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్న హోంమంత్రి వంగలపూడి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో గంజాయి కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయికి సంబంధించి ఏపీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. గంజాయికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ఇస్తామని హోంమంత్రి వెల్లడించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని.. ఆ నంబర్‌కు ఫోన్ చేసి గంజాయిపై సమాచారం ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు. గంజాయిపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయమని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నుంచి గంజాయి వ్యాపారం మీదే బతికేద్దాం అనుకునే వాళ్ళ ఆటలు సాగవన్నారు. ఏ పార్టీ నాయకుడు ప్రమేయం గుర్తించినా ఉపేక్షించేది లేదన్నారు.
Read Also: Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా..
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
విశాఖలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కు పాదం మోపుతామమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈరోజు రాత్రి 8 తర్వాత గుంపులుగా చేరి గంజాయి సేవించే వాళ్ళను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి కేసుల్లో విశాఖలోనే 1230 మంది జైల్లో ఉన్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం అవుతోందన్నారు. వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారులు కావడంతో అక్రమ రవాణాపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శంచారు. కరివేపాకు పేరుతో డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. విశాఖలో గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరా జరుగుతుంటే గత ప్రభుత్వం కనీస సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దగ్గర గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి కారణంగా క్రైమ్ రేట్ పెరిగిందని మంత్రి అనిత వెల్లడించారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!