Andhra Pradesh: వివిధ విభాగాల్లో కొనసాగుతోన్న రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డైన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం వచ్చిన ఆదేశాలను సర్కారు రద్దు చేసింది. రిటైరైనా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరి అయినట్లయితే సంబంధింత నిబంధనలను అనుసరించి తాజా ఉత్తర్వులను పొందాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులకు సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
Read Also: Group Jobs : ఖాళీలను పెంచాలని గ్రూప్ ఉద్యోగాల అభ్యర్థులు ధర్నా