Huge Celebrations at NTR Bhavan: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (88)ను ఇప్పటికే దాటేసింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కనబర్చారు. కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతుండడంతో.. కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కార్యాలయం గేటు ముందు నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కూడా టీడీపీ శ్రేణులు టపాసులు కాల్చారు. ఎన్టీఆర్ భవన్, బాబు నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.