AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Drought: ఇటీవలే కూటమి ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌లో కరువు మండలాల ప్రకటనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా ప్రజలను, రైతులను, వ్యవసాయ కూలీలను నిరాశపరిచిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి, అందుకు తగిన ప్రత్యేక ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్రంలో 544 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం 388 మండలాలను మాత్రమే ప్రకటించిందని విమర్శించారు. వీటిలో 283 మండలాలను తీవ్ర కరువు, 105 మండలాలను మధ్యస్థ కరువుగా ప్రభుత్వం వర్గీకరించారని తెలిపారు..
కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి తగిన సహాయాన్ని పొందాలని శ్రీనివాసరావు కోరారు. పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ డ్రాట్ మాన్యువల్-2016ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో స్పందించలేదని ఆయన ఆరోపించారు. తాజాగా 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడాన్ని కూడా శ్రీనివాసరావు ప్రశ్నించారు. కరువు తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే మరిన్ని ప్రాంతాలను జాబితాలో చేర్చాల్సి ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, పల్నాడు ప్రాంతాలతో పాటు గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోని పశ్చిమ మండలాలు, డెల్టా ప్రాంతాల్లోని చివరి భూములు కూడా వర్షాభావంతో ఎండిపోయాయని పేర్కొన్నారు.
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
వర్షాలు లేక పలు ప్రాంతాల్లో పంటలు సాగు చేయని భూములు ఖాళీగా ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. రైతులు పెట్టిన పెట్టుబడులను నష్టపోయారని, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులపై దృష్టి సారించే క్రమంలో గ్రామీణ ప్రజలు, పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను విస్మరిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో జీవనోపాధి, వ్యవసాయం, తాగునీరు తదితర అంశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రాన్ని కరువు పరిస్థితుల నుంచి ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు తక్షణ ఉపశమన చర్యలు అందించడంతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేక సహాయాన్ని పొందేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!