Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. విజయనగరం జిల్లా రాజాంతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం, తిరువూరులో జరిగిన అగ్నిప్రమాదాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాజాంలోని ఓ ఆటోమొబైల్ షోరూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. దీపావళి టపాసులు ప్రమాదవశాత్తు షోరూమ్‌పై పడటంతో మంటలు చెలరేగి భవనం దగ్ధమైంది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను చేశారని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బాణాసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిరిపడి ఓ ఫర్నిచర్ దుకాణానికి మంటలు అంటుకున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఘటనలో ఆస్తినష్టం జరగడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
Also Read
- ECB: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
- Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
- Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
- Ramayana Box Office: 'ఆదిపురుష్' రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
రాజాం, గన్నవరం, తిరువూరులో జరిగిన మూడు అగ్నిప్రమాదాలపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా దీపావళి సమయంలో బాణాసంచా కాల్చే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
-
ECB: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
-
Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
-
Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..