ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లోనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తోంది.. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లోనే అన్ని అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేసింది..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో "భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా" పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ డీజీపీ.. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో సోషల్ మీడియా వేదికగా వదంతుల వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను హై అలెర్ట్ జోన్స్ గా ప్రకటించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ సీఎఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.. ఇక, చంద్రబాబును కలిసిన వారిలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్న డీజీపీ.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు
ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు ( గురువారం ) ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక రెడీ చేసినట్లు సమాచారం.