NTV Telugu Site icon

CM YS Jagan: వాలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు. తనతో కలిసి నడిచేందుకు మీరంతా సిద్దమేనా అంటూ ప్రజలను జగన్‌ కోరారు. ప్రజలందరికీ నచ్చిన రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమిగా వస్తున్నారని విమర్శించారు. జరగబోయే ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలే కాదని.. అన్నీ సామాజిక వర్గాలకు జరిగే న్యాయాన్ని కొనసాగిస్తూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా.. లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా అని నిర్ణయించే ఎన్నికలని సీఎం పేర్కొన్నారు.

Read Also: Botsa Satyanarayana: మళ్లీ జగన్‌ ప్రభుత్వం రావడం ఖాయం..

రాబోయే ఐదేళ్ళలో మన భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలని తెలిపారు. ఇవి జగన్ కు.. చంద్రబాబుకు మధ్య ఎన్నికలు కావు.. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ పేదల పక్షమని.. మీ ఓటు మంచి కొనసాగుతుందా లేదా అని నిర్ణయిస్తుందన్నారు. మీ ఓటు జగన్‌కు వేస్తే పథకాలు కొనసాగింపు.. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అని.. అందుకే బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. చంద్రబాబు దారి ఎప్పుడు అడ్డదారి.. ఆయన విలువలు పాతాళంలో ఉంటాయన్నారు. చంద్రబాబు పేరు గుర్తొచ్చేది వెన్నుపోటు.. దగా.. మోసం.. అబద్ధాలు.. కుట్రలు.. ఇవి ఆయన మార్కు రాజకీయాలు అంటూ విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడని.. అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి ఫించన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లతో ఫించన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించారని అన్నారు. పెన్షన్లు పేదవారి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వెళ్లి ఇవ్వటం నేరమట అంటూ.. పేదల వద్దకు వెళ్లి వాలంటీర్లు ఇవ్వటం గత 56 నెలలుగా జరుగుతుందన్నారు. మన ప్రభుత్వంలో ఏ వారమైనా.. గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. వెయ్యి ఇచ్చే పెన్షన్‌ను మూడు వేలకు పెంచుకుంటూ పోయి వారి ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నామన్నారు.

Read Also: EC Notices To Jagan: ఏపీ సీఎం జగన్ కు ఆ విషయంపై నోటీసులు ఇచ్చిన ఈసీ..!

చంద్రబాబు జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని ఇచ్చాయి.. గంటల కొద్దీ క్యూ లైన్లో గంటల కొద్దీ నిలబడి తీసుకోవాలన్నారు. చంద్రబాబు కుటిల యత్నం పెన్షన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను మందే ఎండలో రోడ్డుపైకి తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ కోసం 30 మందికి పైగా అవ్వా, తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు ఈ చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. ఆయన రాజకీయాలకు అనేక మంది అవ్వా తాతలు మరణించారన్నారు. 56 నెలలుగా ఒకటో తారీఖున పెన్షన్ అందించామన్నారు. ఎన్నికల సమయంలో.. అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగిందన్నారు. అది ఆగలేదు.. ఆపబడిందన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.