కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపమని.. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారని ఆయన ఆరోపించారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు.