CM Chandrababu: పరిశ్రమల పర్మిషన్లలో సరళీకరణ.. ఆన్లైన్ విధానంపై సీఎం గ్రీన్ సిగ్నల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో అనవసరమైన అడ్డంకులను తొలగించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న 800కి పైగా నిబంధనలను 100లోపు పరిమితం చేయాలని సీఎస్ సహా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. అదేవిధంగా, పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు తగ్గించాలని సూచించారు.
South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన బాక్సాఫీస్ లెక్కలు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
అయితే ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలలో ఎలాంటి రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. అనవసర వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశించారు. అటవీ చట్టాలను సాధ్యమైనంత మేర సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్రానికి అనుకూలమైన నిబంధనలు అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. డబుల్ లైసెన్సింగ్ విధానాలను పూర్తిగా తొలగించాలని, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అయ్యే విధంగా మార్పులు చేయాలని సూచించారు.
డీ-రెగ్యులేషన్ ఫేజ్-2ను మే నెలాఖరులోగా అమల్లోకి తీసుకురావాలని సీఎం ఆదేశిస్తూ, ఇందుకు అవసరమైన ఆర్డినెన్సులను వెంటనే తీసుకురావాలని పేర్కొన్నారు. దరఖాస్తు నుంచి అనుమతుల వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఫేజ్-2 అమలుతో పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో కనీసం 40% సమయం తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు అనుమతులు, నిబంధనల సడలింపులో రాష్ట్రం కేంద్ర ప్రతిపాదనల కంటే ముందంజలో ఉందని అభినందించారు.
దీనికి ప్రతిస్పందనగా సీఎం, రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు “స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్” విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై కూడా చర్చ జరిగింది. జూన్ నెల నుంచి ఫేజ్-3పై పని ప్రారంభిస్తామని కేంద్ర ప్రతినిధులు తెలిపారు. ఫేజ్-3లో టెక్నాలజీ అనుసంధానం, ఏఐ టూల్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే డేటా లేక్, రియల్ టైమ్ డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను సమర్థంగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!