CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరువు, తుఫాన్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విపత్తుల నష్టం, రైతులకు అందించాల్సిన పరిహారంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని, అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నేరుగా ఇన్పుట్ సబ్సిడీని జమ చేయాలని స్పష్టం చేశారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం కూడా రైతులకు సకాలంలో అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కరువు, తుఫాన్ల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి మొత్తం రూ.2,459 కోట్ల పరిహార ప్రతిపాదనలను అధికారులు సీఎం ముందుంచారు. ఇందులో ఎల్‌నినో కరువు నష్టానికి రూ.1,721 కోట్లు, అర్నబ్ తుఫాను నష్టానికి రూ.602 కోట్లు, మురసు తుఫాను నష్టానికి రూ.97 కోట్ల చొప్పున ప్రతిపాదనలు రూపొందించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక రంగాల్లో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి బాధితులకు న్యాయం చేయాలని సీఎం సూచించారు. విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) , ఎస్డీఆర్ఎఫ్ (SDRF) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రైతులకు అండగా నిలవాలని అన్నారు. అంతేకాకుండా.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అదనపు విపత్తు నిధులను త్వరగా సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
- Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
- Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
- Ambati Rambabu : ఋషికొండపై విమర్శలు కాదు.. విచారణ చేయండి
ఉద్యాన పంటలతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ‘జీ రామ్ జీ’ నిధులను వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రకృతి సేద్యానికి ఈ నిధుల వినియోగంపై అవసరమైన అనుమతులను తక్షణమే పొందాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా రెండూ అందేలా సమన్వయంతో పనిచేస్తూ, అన్నదాతల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
-
Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!