CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు.. పనుల పురోగతిపై ఆరా
- పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- స్వాగతం పలికిన మంత్రులు నిమ్మల రామానాయుడు.. పార్థ సారథి.. కందుల దుర్గేష్ సహా.. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు.. కూటమి నేతులు
- మొదట వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతని పరిశీలించిన చంద్రబాబు
- వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయనకు మంత్రులు నిమ్మల, పార్థ సారథి, కందుల దుర్గేష్ సహా.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. కూటమి నేతులు స్వాగతం పలికారు.. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆ వెంటనే.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరారు.. గతంలో ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారు.. మొదట వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతని పరిశీలించిన చంద్రబాబు.. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పైకి చేరుకున్నారు.. స్పిల్ వే 26వ గేట్ వద్ద పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 2. 05 గంటల నుండి 3.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడననున్నారు.
Read Also: Train Accident : బాలాసోర్ రైలు ప్రమాదాన్ని గుర్తుచేస్తున్న కంచన్‌జంగా ప్రమాదం
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
మరోవైపు 31-05-2024 నాటికి పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్ చూస్తే.. హెడ్ వర్క్స్-72.63శాతం, రైట్ మెయిన్ కెనాల్-92.75 శాతం, లెఫ్ట్ మెయిన్ కెనాల్-73.07 శాతం, భూసేకరణ-పునరావాసం-22.55 శాతం, ప్రాజెక్టులో అన్ని పనులు కలిపి 49.79 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.. మెయిన్ డ్యాం ప్యాకేజ్‌లో 1. స్పిల్ వే అండ్ రేడియల్ గేట్లు పనులు పూర్తి, 2. ఎగువ, దిగువ కాఫర్ ఢ్యాంలు-రెండూ పూర్తయ్యాయి.. 3. ఈసీఆర్ఎఫ్ ఢ్యాం(ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం), గ్యాప్-1: ఢయాప్రం వాల్ నిర్మాణం పూర్తి అయింది. నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయి. గ్యాప్-2 : నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయి. ఢయా ఫ్రం వాల్ రిపేర్ల పనులు మొదలయ్యాయి. గ్యాప్-3 : కాంక్రీట్ ఢ్యాం నిర్మాణ పనులు పూర్తయ్యాయంటున్నారు. స్పిల్ ఛానెల్-88శాతం పనులు పూర్తయ్యాయి. అప్రోచ్ ఛానెల్-79శాతం పనులు పూర్తి. ఫైలెట్ ఛానెల్-48 శాతం పనులు పూర్తి.. రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్-68 శాతం పనులు పూర్తి చేసినట్టు సమాచారం.. ఇక, చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం.. కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!