CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం..

  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు
  • సీఎం హోదాలో తొలిసారి హస్తినకు
  • ప్రధాని మోడీ.. అమిత్‌షా.. నిర్మలా సీతారామన్‌..
  • పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న చంద్రబాబు
  • రేపు ఉదయం 10 గంటలకు ప్రధానితో చంద్రబాబు సమావేశం.
Chandrababu Delhi

Chandrababu Delhi

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్తున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం, అమరావతి పూర్తి, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు.

Read Also: Snake Video: దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము.. చివరికి ఏమైందంటే..!

అయితే, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపెడతామనే కూటమికి 164 సీట్లు కట్టబెట్టారు.. రాష్ట్ర పునర్నిర్మాణం అందరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.

Read Also: Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్.. చంపై సోరెన్ అసంతృప్తి..