CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం.. ఉదయం 11.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించమన్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో సమావేశం అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇక, రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం.. తదుపరి రోజు కూడా కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
-
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
-
Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్‌కు శాపమయ్యాయా?
-
Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్