AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాన మంత్రి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
ఇక 16వ ఎస్ఐపిబి (SIPB) సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించి రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది. అమరావతిలో “క్వాంటమ్ వ్యాలీ” పరిధిలో మూడు సంస్థల స్థాపనకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఇది టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
విద్యా రంగంలో ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు ఆర్డినెన్స్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా, రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్రంగా చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పరిపాలనలో భాగంగా 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఇకపై ఉద్యోగ నియామకాలు, బదిలీలు మల్టీ జోన్ మరియు జోనల్ విధానంలో అమలు చేసే దిశగా అడుగులు పడనున్నాయి.
ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. మరోవైపు, కూటమి ప్రభుత్వం త్వరలో రెండేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!