సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయబోతోందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.
‘రాష్ట్ర ఆర్థిక పురోగతికి, పారిశ్రామిక అభివృద్ధికి, ఏఐ డెవలప్‌మెంట్‌కి దోహదపడే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని కేబినెట్‌లో ఆమోదించడం జరిగింది. పెట్టుబడి దారులకి ఒక డెస్టినేషన్ ఉండేలా కేబినేట్ జరిగింది. దేశంలో నెంబర్ 1 దిశలో తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కలిపించే విధంగా ప్రభుత్వం ముందుకి వెళ్తుంది. రిలయన్స్ కన్స్యూమర్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ ఫ్యాక్టరీ, వాటి పెట్టుబడులకి, భూకేటాయింపునకి కేబినేట్ ఆమోదం తెలిపింది. చిత్తూర్ జిల్లాలో సోయా ఫ్యాక్టరీకి కేబినేట్ ఆమోదించింది. కర్నూలులో మష్రూమ్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ని అభివృద్ధి చేసేందుకు కేబినేట్ ఆమోదం. మన రాష్ట్రంలో వీటి ఉత్పత్తికి అనుకూలంగా ఉండనుంది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు.
Also Read: AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్!
‘టూరిజం అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో ఉన్న వనరులని వినియోగించుకునేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో స్టార్ హోటల్స్ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదం తెలిపింది. అరకు వ్యాలీ, అమరావతి ఇలా టూరిజం ప్రాంతాలలో స్టార్ హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదించింది. సాఫ్ట్వేర్ రంగంలో కీలక పాత్ర వహించనున్న రైడన్ ఇన్ఫోటిక్ డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు, విశాఖలోని మూడు ప్రాంతాలలో అతి పెద్ద డేటా సెంటర్స్ కి సంబంధించి భూ కేటాయింపులకి కేబినేట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా భవిష్యత్తులో మరికొన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉండనుంది. సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే రెవెన్యూ వచ్చే మార్గాలను చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ సంస్థ ఏర్పాటుకి కాబినేట్ ఆమోదం తెలిపింది. అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటిక్ కాంపౌనెంట్ సంస్థ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదించింది’ అని మంత్రి పార్థసారథి చెప్పుకోచ్చారు.
