Minister Partha Sarathy: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అని మంత్రి పార్థసారథి తెలిపారు. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతుంది.. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది.. గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయబోతోందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.…