NTV Telugu Site icon

Purandeswari: పొత్తులపై పురంధేశ్వరి క్లారిటీ!

Purandeswari

Purandeswari

Purandeswari: విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో కాసేపట్లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో 26 జిల్లాల ఇంఛార్జ్‌లు పాల్గొననున్నారు. ఎలక్షన్లలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనే అంశంపై సమావేశంలో నిర్ణయించనున్నారు. ఓటరును బూత్ వరకూ తీసుకురావడానికి చేయాల్సిన పనులపై ఇవాళ చర్చిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను కొందరు ఉల్లంఘిస్తారని.. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని ధర్మాన చెప్పడం ఈసీ ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించడమేనని ఆమె విమర్శించారు. వాలంటీర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చేయాలని జగన్ సభలో చెప్పడం ఈసీ నిబంధనలు ఉల్లంఘనేనని ఆమె అన్నారు.

Read Also: Chandrababu: టీడీపీ-జనసేన తొలి జాబితాపై సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ.. సర్వత్రా ఉత్కంఠ

ఇవన్నీ పొందుపరుస్తూ సీఈసీకి తాను లెటర్ రాశానన్నారు. అయోధ్య కలను సాకారం చేసిన పాలన నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రజాపోరు యాత్రలో బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందో చెబుతున్నామన్నారు. బీజేపీని రాష్ట్రంలో ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకొస్తున్నారన్నారు. పొత్తుపై మా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని.. టీడీపీ-జనసేనలో పొత్తులో ఉండి సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి స్పష్టం చేశారు.