రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది..భారీ అంచనాలతో పాన్ ఇండియన్ లెవెల్‌లో విడుదల అయిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్‌సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషించారు. టైగర్ నాగేశ్వరావు తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.అయితే టైగర్ నాగేశ్వరరావు మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్‌లో ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.సినిమా రిజల్ట్ కారణంగా ఈ నిర్ణయంలో మార్పు జరిగినట్లు తెలిసింది.
నవంబర్ లాస్ట్ వీక్‌లో టైగర్ నాగేశ్వరరావు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నవంబర్ 24న ఈ బయోపిక్ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దాదాపు 15 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం… 1980 దశకంలో తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన గజదొంగగా పిలువబడిన స్టూవర్ట్‌పురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఫిక్షనల్ బయోపిక్‌గా టైగర్ నాగేశ్వరరావు సినిమాను డైరెక్టర్ వంశీ తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాకు రన్ టైం బాగా మైనస్ గా మారింది. దాదాపు మూడు గంటలకు పైగా వున్న ఈ సినిమాలో కొన్ని లాగ్ సీన్స్ ఉండటంతో సినిమా చూసే ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమా రన్ టైం ను మేకర్స్ 2 గంటల 37 నిముషాలకు కుదించారు..అలాగే ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అదరగొట్టారు.. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది..