Heart Attack: ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి

  • ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి
  • శోకసంద్రంలో ఆయన కుటుంబసభ్యులు
Heart Attack

Heart Attack

Heart Attack: ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి చెందాడు. కె.లూధియారావు అనే మార్షల్‌కు ఉదయం విధుల్లో ఉండగా గుండెపోటు రాగా.. వెంటనే తోటి సిబ్బంది మంగళగిరి ఎన్నారై హాస్పటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. లూధియారావు మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తోటి సిబ్బంది కూడా కన్నీరు పెట్టుకున్నారు.

Read Also: Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలితో సహా ముగ్గురు హత్య

గుండెపోటుతో మరణించిన అసెంబ్లీ మార్షల్ కుటుంబాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరామర్శించారు. మార్షల్ లూధియారావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి స్పీకర్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి లూధియరావు కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపడతామని స్పీకర్ హామీ ఇచ్చారు.