NTV Telugu Site icon

AP Assembly: అసెంబ్లీ రేపటికి వాయిదా.. ఆ ముగ్గురు తప్ప అంతా ప్రమాణం..

Aps

Aps

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ రేపటికి వాయిదా పడింది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యాయి.. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. ఆ తర్వాత మంత్రులు.. తదుపరి వైఎస్‌ జగన్‌.. ఆ వెనక అక్షర క్రమంలో సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.. అయితే, అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయేదు.. ఇవాళ మొత్తంగా 172మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్‌ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు.. దీంతో.. అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు.. రేపు ఉదయం పదిన్నర గంటలకు తిరిగి ప్రారంభంకానుంది ఏపీ శాసనసభ.. రేపు ఉదయం మిగిలిపోయిన సభ్యులు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, కొండబాబు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు.. సభ్యుల ప్రమాణo తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఇప్పటికే తమ స్పీకర్‌ అభ్యర్థిగా సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుని ఎంపిక చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈ రోజు అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్న విషయం విదితమే.. కాగా, రేపు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.